ETV Bharat / state

విశాఖలో దారుణం - ల్యాప్‌టాప్‌ కోసం కన్న తల్లినే కడతేర్చిన కుమారుడు - SON MURDERED HIS MOTHER IN AP

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిన కుమారుడు - ల్యాప్‌ట్యాప్‌ దాచిన తల్లితో గొడవ - పెనుగులాటలో పదునైన ఆయుధంతో పొడిచిన కుమారుడు - అక్కడికక్కడే మృతి చెందిన తల్లి

Son Murdered His Mother Due To Online Games in Visakhapatnam
Son Murdered His Mother Due To Online Games in Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 2:19 PM IST

Son Murdered His Mother Due To Online Games in Visakhapatnam : విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆన్​లైన్ గేమ్స్ ఆడేందుకు ల్యాప్‌టాప్‌ ఇవ్వనందుకు సొంత తల్లిలే కుమారుడు కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దని వారించిన కన్నతల్లిని కుమారుడే కడతేర్చాడని వెల్లడించారు. విశాఖ మల్కాపురంలోని కోస్టుగార్డు క్వార్టర్స్‌లో భర్త బల్బీర్‌సింగ్, ఇద్దరు పిల్లలతో కలిసి అల్కసింగ్ నివసిస్తోందన్నారు. రెండ్రోజుల కిందట బీటెక్‌ చదువుతున్న కుమారుడు అనుమొల్‌సింగ్‌ ఆన్‌లైన్‌గేమ్‌ ఆడుతుండగా చూసిన దంపతులు అతడి నుంచి ల్యాప్‌టాప్‌ తీసుకున్నట్లు చెప్పారు.

భర్త బల్బీర్‌సింగ్ విధుల నిమిత్తం ఒడిశాకు వెళ్లడంతో ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని తల్లి అల్కసింగ్‌తో కుమారుడు అనుమొల్‌సింగ్ గొడవపడినట్లు వెల్లడించారు. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసగా మారొద్దని తల్లి వారించిందని ఈ క్రమంలో కుమారుడితో పెనుగులాట జరిగిందన్నారు. తల్లి అల్కసింగ్‌ను కుమారుడు అనుమొల్‌సింగ్ పదునైన ఆయుధంతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. రాత్రి ఘటన జరిగినా బయటకు పొక్కనీయకుండా మృతదేహాన్ని కల్యాణి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆమె చేతిలో యువకుడు హత్య - అసలు కారణమేంటి?

చెల్లిని చంపేసి యాక్సిడెంట్​గా చిత్రీకరించిన అన్న - ఎందుకో తెలిస్తే షాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.