వృద్ధురాలికి రూ.26,732 ఇంటి పన్ను - ప్రభుత్వ తీరుకు నిరసనగా గోడపై ఏం రాసిందంటే! - Psyho Povali Cycle Ravali in kanigiri

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 5:55 PM IST

Psycho Povali Cycle Raavali Slogan on Wall : వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఖండిస్తూ ఓ వృద్ధురాలు వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఇంటి పన్ను భారాన్ని భరించలేక  ఇంటి ప్రహరీ గోడ వెలుపల సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని రాసి తన నిరసనను తెలియజేసింది.

Old Women Protest Against YCP Government : ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ నివాసానికి సమీపంలో ఓ వృద్ధురాలు  నివాసముంటోంది. తనకున్న కొద్దిపాటి ఇంటిలో ఒంటరిగా కుట్టు మిషన్ పై ఆధారపడి జీవనం సాగిస్తుంది. తాను ఉంటున్న ఇంటికి రూ.26,732 ఇంటి పన్ను రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెంది... భయానికి లోనైంది. గతంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఇంటి పన్ను చెల్లించడంలో ఆలస్యమైంది. అందుకుగాను ప్రస్తుతం ఇంటి పన్ను పై వడ్డీ మీద వడ్డీ విధించారు. ఒకేసారి ఇంటి పన్ను ఇంత పెద్ద మొత్తంలో రావడంతో ఈమె ఆందోళన గురయింది. మిషన్ కుడుతూ జీవిస్తున్న తాను ఇంత పన్ను ఎలా కట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి పన్ను భారం తగ్గించి తగిన న్యాయం చేయాలని వేడుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.