thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 8:40 AM IST

ETV Bharat / Videos

Protest in America Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలో కొవ్వొత్తుల ప్రదర్శన..

Protest in America Against Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ గత మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, రాష్ట్ర బంద్ కార్యక్రమాలు  కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశం వెలుపల ఉన్న ప్రవాసాంధ్రులు సైతం (NRI Protest) చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా అమెరికాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 

NRI Protest Against CBN Arrest in AP Skiil Development Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్‌, రిమాండ్​ను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాసాంధ్రులు ఆందోళన చేశారు. అమెరికాలోని వాషింగ్‌టన్‌ డీసీలో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా, సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్‌ వేమన, యష్‌ బొడ్డులూరి సహా ప్రవాసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.