Kavali area hospital : కావలి ఏరియా వైద్యశాలకు వెళ్తున్నారా..? ఫ్యాన్, దుప్పటి పట్టుకెళ్లాల్సిందే! - andhra politics
🎬 Watch Now: Feature Video
kavali area hospital : నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాల సమస్యల నిలయంగా మారింది. సరైన సౌకర్యాలు లేక వైద్యశాలకు వచ్చే రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గైనకాలజీ విభాగంలో బెడ్లు లేక వరండాలోనే సెలైన్ బాటిళ్లు పెడుతున్నారు. ప్రసవించిన అనంతరం తల్లీ బిడ్డ ఉండే గదిలో ఫ్యాన్లు సక్రమంగా లేకపోవడంతో ఇంటి నుంచే టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అని రోగులు చెప్తున్నారు. చిన్నపిల్లలకు వైద్యం అందించే విభాగంలో బెడ్లు పూర్తిగా చిరిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని రోగులు వాపోతున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లను బెడ్లపై వేసుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా ఏర్పాటు చేసిన జనరేటర్ సరిగ్గా పనిచేయడం లేదన్నారు. బ్లడ్ బ్యాంకు ఉపయోగించుకునేందుకు ఏర్పాటు చేసిన జనరేటర్ మరమ్మతుకు గురైందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో.. మురుగునీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బంది పడుతున్నారన్నారు. మ్యాన్ హోల్ పూర్తిగా వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. జగనన్న ప్రాణవాయువు ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నప్పటికీ పనిచేసిన దాఖలాలు లేవు అని ప్రజలు చెబుతున్నారు. రోగులు తాగేందుకు రక్షిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసినా.. సక్రమంగా పనిచేయక వైద్యశాలకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు సమస్యలపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.