Priests Dharna in Gorantla సెలవు కావాలన్న అర్చకుడిపై ఆలయ కమిటీ దాడి.. ధర్నాకు దిగిన అర్చకులు - గోరంట్ల తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-09-2023/640-480-19647090-thumbnail-16x9-priests-dharna-in-gorantla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 5:56 PM IST
Priests Dharna in Gorantla: గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న అర్చకునిపై ఆలయ కమిటీ సభ్యులు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. మూలవిరాటు ఉన్న గదికి తాళంవేసి అర్చక సంఘాలు ధర్నా చేపట్టాయి. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయి అనే వ్యక్తి తనకు ఆరోగ్యం బాగోలేదని సెలవు కోరటానికి కమిటీ సభ్యుల వద్దకు వెళ్లాడు. సెలవు కోసం వెళ్లిన తనను ఆలయ కమిటీ సభ్యులు ఆసభ్యంగా తిడుతూ.. కర్రతో దాడి చేశారని ఆ అర్చకుడు ఆరోపించారు. దీంతో తాను ఎంతో మనోవేదనకు గురైన్నట్లు ఆయన పేర్కొన్నారు. దాడి చేసిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు అర్చకుడు తెలిపారు. ఆరోగ్యం బాలేదని సెలవు కోరిన అర్చకునిపై కమిటీ సభ్యులే దాడి చేయడాన్ని అర్చక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడి పాల్పడిన ఆలయ కమిటీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని అర్చక సంఘాలు నాయకులు కోరారు. అలాగే గోరంట్ల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.