Prathidwani: రాష్ట్రంలో గంజాయి ఘాటు.. పోలీసు శాఖ ఏం చేస్తోంది?
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 8:42 PM IST
Prathidhwani: రాష్ట్రం గంజాయి ఘాటు భరించలేని స్థాయికి చేరుతోంది. సమస్య తీవ్రతపై ఎంత చెబుతున్నా పట్టని పాలకుల అలసత్వానికి.. గంజాయి మాఫియా అరాచకాలకు రేపటితరం కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మత్తు కోరల్లో బంగారు బాల్యం చిత్తయిపోతోంది. పాడేరులోని ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కొందరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో బడులు.. గుడులు.. పవిత్రక్షేత్రాలను వదలని స్థాయికి చేరిన గంజాయి మఫియా ఇంతగా చెలరేగి పోవడానికి కారణం ఏమిటి? ఈ గంజాయి ముఠాలకు అంత ధైర‌్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇంత జరుగుతుంటే ఏపీలో మరి పోలీసు శాఖ ఏం చేస్తోంది? 2022 సంవత్సరాంతంలో ఏపీ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో గతేడాది 2లక్షల 45వేల కిలోల గంజాయి పట్టుకున్నామని చెప్పారు. పోలీసులకు చిక్కిందే అంత గంజాయి ఉంటే.. దొరకకుండా వినియోగించేది, రవాణా అయ్యేది ఇంక ఎన్ని రెట్లు ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.