PRATHIDWANI సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలకు కారణమేంటి - కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు
🎬 Watch Now: Feature Video
కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ, ఈసీ నియామకాలకు కూడా కొలీజియం తరహా వ్యవస్థను తీసుకుని రావాలి. నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ కోసం నిర్వచన సదన్‌ను స్వతంత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలి. ఇదే విజ్ఞప్తితో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా... కీలక వ్యాఖ్యలు చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. కేంద్రప్రభుత్వాలకు తమకు నచ్చిన వారిని, "ఎస్" అంటూ తల ఊపే వ్యక్తులనే సీఈసీలుగా నియమిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక ఇరుసులాంటి ఎన్నికల సంఘానికి సంబంధించి, సుప్రీం కోర్టు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి? ఈ సందర్భంగానే టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు సీఈసీగా ఉండాలని కోరుకుంటున్నట్లు సుప్రీం అనడానికి నేపథ్యం ఏమిటి? ఈ విషయంలో దిద్దుబాట చేపట్టాల్సింది.. ఎవరు.. ఎక్కడ.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST