PRATHIDWANI: సర్పంచ్‌లకు గౌరవప్రదమైన ప్రాధాన్యం దక్కేనా..? - దారి మళ్లుతున్న సర్పంచుల నిధులు
🎬 Watch Now: Feature Video
Prathidwani: ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇంటి పెద్దకు చెప్పుకుంటాం.. అలాగే ఊళ్లో ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దకు చెప్పుకుంటాం.. కానీ ఆ గ్రామ పెద్దకే సమస్య వస్తే.. సమస్య సృష్టించిందే ప్రభుత్వమైతే... ఎవరికి చెప్పుకోవాలి. ఒకప్పుడు గ్రామపెద్దగా ఓ వెలుగువెలిగిన సర్పంచుల నిధులు, విధులు లాగేసుకుని వైఎస్సార్సీపీ సర్కార్ వాళ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. నేటితో రెండేళ్లు పదవీకాలం పూర్తైనా.. చెప్పుకోడానికి ఒక్క పనీ చేయలేకపోయామని సర్పంచ్‌లు కుమిలిపోతున్నారు
రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరిగి గ్రామసభలు కొలువుదీరిన రెండేళ్లు అయ్యింది. నిధులు పక్క ఖాతాలకు దారి మళ్లుతున్నాయి.. విధులు సచివాలయాలకు తరలిపోతున్నాయి.. సగటు సర్పంచ్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? గ్రామ పరిధిలో సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్దిదారుల ఎంపికలో సర్పంచుల పాత్ర ఎలా ఉంది? అప్పుల పాలై పోయారన్న ఆవేదనలకు కారణం ఏంటి..? పంచాయతీలకు ఇచ్చిన అధికారాలు ఏమిటి? వాటిల్లో రాష్ట్రంలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకం పెట్టుకుని ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతున్నారు? నిధులు, విధుల విషయంలో సర్పంచ్‌లకు గౌరవప్రదమైన ప్రాధాన్యం దక్కాలంటే ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ. ఈ చర్చలో పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, బాపట్ల జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్, సర్పంచుల సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.