PRATHIDWANI జీతాలు, పెన్షన్లు ఇతర హామీల అమలు కోసం ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణ - జీతాలు పెన్షన్లు హామీల ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI జీతాలు, పెన్షన్లు.. హామీల అమలు కోసం ఎదురు చూపులు! రాష్ట్రంలో లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇది. ఆందోళనలు, ఉద్యమాలు, సంప్రదింపు, చర్చల్లోనే.. నెలలునెలలు గడిచి పోతున్నాయి. గడువుల మీద గడువులు దాటుతున్నాయి. కానీ ఒక్క విషయంలోనూ ఉద్యోగులు అందరు సంతృప్తి వ్యక్తం చేసే రీతిలో పరిష్కారాలు కనిపించడం లేదు. చెల్లింపుల్లో జాప్యం నివారణ, డీఏ బకాయిలు, పాత పింఛను విధానం పునరుద్ధరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వారి డిమాండ్ల జాబితా పెద్దదే ఉంది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి అమితుమీకి సిద్ధం అవుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున దఫదఫాలుగా సర్కారుకు వినతిపత్రాలు అందిస్తున్నారు. మరి వారి తర్వాతి కార్యాచరణ ఎలా ఉండనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST