గుళ్లు కూల్చారు, రథాలు కాల్చారు - శివాలయం కూడలిని వైఎస్సార్ సెంటర్ అని మారుస్తారా? : పోతిన మహేశ్ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 4:29 PM IST
Pothina Mahesh Complains About YSR Statue Being Placed Illegally: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని క్రాంబ్వే రహదారిలో వైఎస్సార్ విగ్రహం అక్రమంగా ఏర్పాటు చేయడంపై న్యాయపోరాటం చేస్తామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో స్వాతంత్ర్య పోరాట యోధులు, వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటుకు తాము అనుమతి కోరితే.. సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని లిఖిత పూర్వంగా చెప్పిన మున్సిపల్ శాఖ అధికారులు... ఇవాళ వైఎస్సార్ విగ్రహం పెట్టడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
జనసేనకు ఒక రూల్.. వైసీపీకి ఒక రూల్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురంలో వందల ఏళ్లుగా శివాలయం కూడలి అని పిలవబడే ప్రాంతాన్ని వైఎస్సార్ కూడలిగా పేరు మార్చి వైసీపీ నాయకులు దేవుడితో ఆటలాడుతున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులని నిర్బంధించడం దారుణమన్నారు. త్వరలో ఈ పర్యవసానాలకి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార పార్టీ అహంకారానికి తలవంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడానికి అనుమతులు ఇచ్చిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ నగర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.