thumbnail

By

Published : Apr 23, 2023, 12:53 PM IST

Updated : Apr 23, 2023, 3:10 PM IST

ETV Bharat / Videos

Cricket: ఉదయం 8 తర్వాతే క్రికెట్​ ఆడుకోవాలి.. యువకులకు పోలీసుల అల్టిమేటం

Police Warning to Youngers : నందిగామలోని జిల్లా పరిషత్​ పాఠశాల మైదానంలో క్రికెట్​ ఆడుతున్న యువకులకు వింత అనుభవం ఎదురైంది. ఉదయం 8గంటలు దాటిన తర్వాతే క్రికిట్​ ఆడుకోవాలని పోలీసులు వారిని హెచ్చరించారు. పాఠశాల మైదానంలో క్రికెట్​ ఆడుకోవటానికి వచ్చిన యువకులను పోలీసులు ఇలా హెచ్చరించటంతో ఖంగుతిన్నారు. 

అసలేం జరిగిందంటే : నందిగామ, జిల్లా పరిషత్​ పాఠశాల మైదానంలో అదివారం ఉదయం క్రికెట్​ ఆడుకోవటానికి కొంతమంది యువకులు పాఠశాల మైదానానికి వచ్చారు. ఆ సమయంలోనే పాఠశాల మైదానంలోకి నందిగామ వాసులు వాకింగ్​ కోసమని వచ్చారు. ఎప్పటిలాగానే యువకులు క్రికెట్​ ఆడటం ప్రారంభించారు. హూషారుగా సాగుతున్న వేళ.. బంతి వేగంగా వెళ్లి వాకింగ్​ చేసుకుంటున్న వ్యక్తికి తగలటంతో గాయపడ్డాడు. దాంతో వాకర్స్​, యువకుల మధ్య వివాదం చోటు చేసుకోగా.. మాటల యుద్ధం చెలరేగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్రికెట్​ ఆడుతున్న యువకులను అదుపులోకి తీసుకుని వారిని హెచ్చరించారు. ఉదయం 8 దాటిన తర్వాత మాత్రమే క్రికెట్​ ఆడుకోవాలని సూచించారు. క్రికెట్​ ఆడుకోవటానికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశం ఏదైనా ఉంటే చూసుకోవాలని యువకులకు తెలిపారు. లేకపోతే ఉదయం 6గంటల నుంచి 8వరకు వాకర్స్​ ఉంటారని.. ఆ సమయంలో క్రికెట్​ ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు యువకులకు వార్నింగ్​ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. 

Last Updated : Apr 23, 2023, 3:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.