Shravan Kumar is in police custody: మరోమారు పోలీసుల అదుపులో జడ శ్రావణ్ కుమార్ - పోలీసుల అదుపులో జడ శ్రావణ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2023, 10:42 PM IST

Updated : May 14, 2023, 6:16 AM IST

Jai Bheem Party President Jada Shravan Kumar: ఆర్ 5 జోన్​కు వ్యతిరేకంగా అమరావతిలో స్మృతివనానికి  వెళ్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినితిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైన జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా శ్రావణ్ కుమార్ ఉదయం నుంచే పోలీస్ స్టేషన్​లో నిరసన దీక్ష చేపట్టారు.  ఎట్టకేలకు  పోలీసులు సాయంత్రం 6 గంటలకు ఆయను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన అనంతరం.. జడ శ్రావణ్  మీడియాతో మాట్లాడారు.  తనను అక్రమంగా రోజంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని మండిపడ్డారు. రానున్న కాలంలో ఇదే పోలీస్ స్టేషన్​లో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెడతానని హెచ్చరించారు.  అనంతరం మళ్లీ  ఆర్ 5 జోన్​కు వ్యతిరేకంగా అమరావతిలోని అంబేద్కర్ శృతి వనానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మరోమారు పోలీసులు  శ్రావణ్ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం ఆయనను పోలీసులు తమ కారులో ఎక్కించుకుని విజయవాడ నగరంలో తిప్పుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లుతున్నారో చెప్పకుండా నగరం మెత్తం తిప్పడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Last Updated : May 14, 2023, 6:16 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.