PM Rojgar Mela 2023: విజయవాడలో పీఎం రోజ్‌గార్‌ మేళా.. పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి - విజయవాడలో పీఎం రోజ్‌గార్‌ మేళా కార్యక్రమం 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2023, 10:03 PM IST

Modi Started PM Rojgar Mela programme 2023 : పీఎం రోజ్‌గార్‌ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పర్యటించారు. రైల్వే డీఆర్‌ఎం ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న వారికి నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 70 వేల మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్యారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోదీ ప్రసంగించిన తర్వాత డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ విజయవాడలో పత్రాల ప్రదానం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పాటిస్తున్నామని, ఎక్కడా అవినీతి, బంధుప్రీతికి చోటు లేదని ఆయన అన్నారు. పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలంతా డిజిటల్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని, సామాన్యులు సైతం ఈ లావాదేవీలు జరిపేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందజేస్తోందని భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ తెలిపారు.

కేంద్ర సహాయమంత్రిని సన్మానించిన సీఎం : ఈ సంధర్భంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రిని సీఎం సన్మానించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.