పెనుకొండకు ఉషశ్రీ వద్దు - వైసీపీ శ్రేణుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Penukonda YCP Activists Against Minister Ushasri: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పు, అభర్థుల మార్పు ప్రక్రియ, పార్టీలో చిచ్చు రగుల్చుతోంది. స్థానిక నాయకులను కాదని ఇతర ప్రాంతాల నాయకులను ఇన్చార్జ్లుగా నియమించడాన్ని, అభ్యర్థులుగా ప్రకటించడాన్ని స్థానిక నేతలు, శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పెనుకొండ వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి ఉషశ్రీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరసనలు రెండు రోజుల నుంచి కొనసాగుతుండగా.. ఆమె పోటీకి సహకరించేది లేదని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని మంత్రి ఉషశ్రీ చరణ్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో పెనుకొండ వైఎస్సార్సీపీ నాయకులు, ఉషశ్రీ మాకు వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ మహమ్మారి అని స్థానికి నేతలు దుయ్యబట్టారు. పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని మంత్రి ఉషశ్రీ ప్రకటనతో, పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉషశ్రీ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గంలో స్థానిక నాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన చరిత్ర ఉషశ్రీ చరణ్‌దని, పెనుకొండ వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. పెనుకొండ నుంచి పోటీ చేస్తే అస్సలు సహకరించబోమని తేల్చిచెప్పారు.