Pawan Kalyan Tweet: పార్లమెంట్ సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయి.. పవన్ ట్వీట్ - pawan kalyan reaction on women missing
🎬 Watch Now: Feature Video
Pawan Kalyan Reaction on Women Missing: ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు, మహిళల అదృశ్యంపై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్లమెంట్ సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయంటూ గణాంకాలను పోస్ట్ చేశారు. 2019 - 2021 మధ్య మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అద్యశ్యమయ్యారని అన్నారు. హోంశాఖ వెల్లడించిన సమాచారానికి ఏపీ మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందని పవన్ ప్రశ్నించారు. ఏపీలో తప్పిపోయిన బాలికల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర సమాచారమని అన్నారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారని నిలదీశారు. తప్పిపోయిన వారికి ఏమి జరుగుతోందని.. ఎవరిది బాధ్యతని పవన్ మండిపడ్డారు. దీనిపై హోంశాఖ, డీజీపీని ఏపీ మహిళా కమిషన్ వివరణ కోరుతుందా అని అడిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా అంటూ అడిగారు. బాలికల అదృశ్యంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. కాగా వారాహి విజయయాత్రలో మహిళల అదృశ్యంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదే విషయాలను నేడు కేంద్ర హోంశాఖ వెల్లడించడంతో పవన్ మరోసారి స్పందించారు.