Old Woman Tears On Chandrababu Arrest : విజయనగరంజిల్లాలో చంద్రబాబు అరెస్టుతో కన్నీటిపర్యంతమైన వృద్ధురాలు - ap latest politics

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 8:48 AM IST

Old Woman Tears On Chandrababu Arrest : చంద్రబాబు బయటకు వచ్చేలా చూడండి నాయన. మాలాంటి పేదలకు ఆయనే ఆధారం. తండ్రిలాంటోడు. తొందరగా వచ్చేలా చేయండి. చంద్రబాబుని విడుదల చేయాలి అంటూ కనిపించిన టీడీపీ నాయకుల ముందు ఓ వృద్ధురాలు కన్నీరు పెట్టుకున్న ఘటన  విజయనగరంజిల్లా గంట్యాడ మండల రామవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో అవగాహన కల్పించి.. వారి మద్దతు కోసం ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బాబుతో నేను సైతం కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మండలానికి చెందిన టీడీపీ నాయకులు రామవరంలో ఇంటింటా పర్యటిస్తున్నారు. టీడీపీ నాయకుల బృందం ఆ గ్రామంలో వీధికి వెళ్లారు. వారు స్థానికులను కలసి వస్తుండగా.. సత్యవతి అనే వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. టీడీపీ నాయకులు ఆమె వద్దకు వచ్చి ఆరా తీయగా.. తండ్రిలాంటోడు.. మాలాంటి పేదలకు ఆయనే ఆధారం. తొందరగా వచ్చేలా చేయండి అంటూ టీడీపీ నాయకులను ప్రాథేయపడింది.. టీడీపీ నాయకులు త్వరలోనే కడిగిన ముత్యంలా  చంద్రబాబు బయటకు వస్తారని.. భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.