NRIs Protest for TDP Chandrababu: చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు.. బహెరెన్‌లో కదంతొక్కిన ఎన్నారైలు.. - చంద్రబాబు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 12:37 PM IST
NRIs Protest for TDP Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు భగ్గుమంటున్నారు. అక్రమంగా ఆయనను అరెస్టు చేశారంటూ.. రోడ్లపై పెద్ద ఎత్తున ర్యాలీలు, రిలే దీక్షలు, నిరసనలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ఆయనను జైలు నుంచి విడుదల చేసేంతవరకూ ఆందోళనలను విరమించమంటూ మండిపడుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం వెలుపల వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ బహెరెన్‌లోని మనామా నగరంలో ఎన్నారై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'ఐయామ్ విత్ సీబీఎన్' అనే కార్యక్రమం ఫర్వానియాలో నిర్వహించి.. 'వియ్ వాంట్ జస్టీస్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.