లండన్‌లో కన్నులపండువగా దీపావళి సంబరాలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వంటకాలు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2023, 10:17 AM IST
NRIs Celebrated Diwali Grandly in London: లండన్‌లో ప్రవాస భారతీయులు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఏ దేశమేగినా.. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను మరువకూడదని అభిప్రాయపడ్డారు. "ఇండియన్ ఫ్రెండ్స్ ఇన్ లండన్" (Indian Friends in London) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు (Diwali celebrations) బ్రెంట్వుడ్ నగరంలో కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమానికి భారత సంతతివారు సుమారుగా 400 మందిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
భారతీయ వంటకాలు, తెలుగు సంప్రదాయ వంటకాలలో విందు భోజనం ఏర్పాటు చేశారు. చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు అలరించాయి. అనంతరం అందరూ ఒక దగ్గర చేరి బాణసంచా కాల్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాస డబ్బీరు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా దీపావళి వేడుకలను లండన్‌లో భారతీయులందరితో కలిసి మన పండుగులని చేసుకోవటం సంతోషదాయకన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమ ఏర్పాట్లను కార్యవర్గ సభ్యులు శ్రీలక్ష్మి వేముల, రుద్ర వర్మ బట్ట పర్యవేక్షించారు.