Farmers Facing Problems Video: నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం.. నిమ్మల రామానాయుడు ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
అకాల వర్షాలతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అన్నదాతల ఆవేదనను నోటి మాటగా చెబితే సరిపోదని భావించిన తెలుగుదేశం సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రిపోర్టర్ అవతారమెత్తారు. పంట కొనుగోళ్ల జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను...ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచారు. రైసు మిల్లుల ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. లారీలు, ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలు తీసుకువచ్చి బారుల తీరిన వాహనాలను వీడియోలో చూపించారు. ధాన్యంతో పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను.. ద్విచక్రవాహనంపై వెళుతూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వివరించారు. 50 ఏళ్ల రైతు చరిత్రలో ఇలాంటి కష్టాలను గతంలో ఎప్పుడూ చూడలేదని నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. తేమ పేరుతో రూ. 30 కట్ చేస్తున్నారని ఆరోపించారు. నూక అవుతోందని మరో రూ. 100 వసులు చేస్తున్నారని నిమ్మల పేర్కొన్నారు. తరుగు పేరుతో మరో రూ.30 వసులు చేస్తున్నారని నిమ్మల విమర్శించారు. చంద్రబాబు రైతులను పరామర్శించడానికి వచ్చారని ధాన్యాన్ని అప్పటికప్పుడు మిల్లుల వద్దకు తీసుకు వచ్చారని నిమ్మల ఆరోపించారు.