National leaders condemn Chandrababu arrest చంద్రబాబుకు మద్ధతు ప్రకటించిన పలు జాతీయపార్టీలు.. లోకేశ్‌తో భేటీలో పలు కీలక అంశాలపై చర్చ - లోకేశ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 6:37 PM IST
National leaders condemn Chandrababu arrest స్కిల్ డెవలప్ మెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా... జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీలో మద్దతుకుడగడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వివిధ మార్గాల ద్వారా జాతీయ స్థాయిలో చర్చలు జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా... తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పక్షాన వివిధ పార్టీ నేతలు స్పందించారు. చంద్రబాబు కోసం చేస్తున్న న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని వివిధ జాతీయ పార్టీల నేతలు ప్రకటించారు. ఈ మేరకు నారా లోకేశ్‌ని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండేలు కలిసి పరామర్శించారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వారు స్పష్టం చేవారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలతో తెలుగుదేశం పార్టీ రూపొందించిన బుక్ లెట్‌ని జాతీయ పార్టీ నేతలకి లోకేశ్ అందజేశారు. అనంతరం రాష్ణ్రంలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లపై వారికి వివరించారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి తమకు మద్ధతుతెలిపిన ఆయా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.