Nara Lokesh Yuvagalam Padayatra: 'టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా నోటిఫికేషన్లు.. గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు'
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ యువనేత, యువగళం రథసారథి.. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మరో మైలు రాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న మొదలైన యువగళం పాదయాత్ర ఈరోజుతో 200వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్రలో నారా లోకేశ్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
TDP Youth Leader Lokesh Held A Face-To-Face Program With Tribals: యువనేత లోకేశ్ మాట్లాడుతూ.. ''గిరిజనులకు ప్రత్యేక ప్రణాళికతో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. రోడ్ల అనుసంధానం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తండాలకు రహదారులు ఏర్పాటు చేస్తాం. ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎస్టీ సోదరులపై దాడులు జరుగుతున్నాయి. ఎస్టీల భూములను వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. ఎస్టీలకు రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించాలి. తండాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అరకు కాఫీ కోసం స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గ్రామాల్లో ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. నిరుద్యోగ, గిరిజన యువతకు ఉపాధి కల్పనకు హామీ ఇస్తున్నా'' అని ఆయన అన్నారు.