Nara Lokesh Responded to Police Case Against TDP Activists: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ కేసులా: లోకేశ్ - లోకేశ్ యువగళం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 4:28 PM IST
|Updated : Aug 25, 2023, 5:01 PM IST
Nara Lokesh Responded to Police Case Against TDP Activists: యువగళం సభలో తనతో పాటుగా.. తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని, పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో అని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష తెదేపా నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ప్రతిపక్షనేతగా వున్న జగన్ రెడ్డి చేసినవని మండిపడ్డారు. అపోజిషన్ లీడర్‌లా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పులతో కొట్టండి, చీపుర్లతో తరమండి అని విద్వేషం నింపే ప్రసంగాలు చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోకేశ్ ఓ వీడియోను విడుదల చేశారు.