Nara Bhuvaneswari Bus Yatra From Naravaripalle నారావారిపల్లె నుంచే నారా భువనేశ్వరి బస్సు యాత్ర.. ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు - Former minister Amarnath Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 7:17 PM IST

Nara Bhuvaneswari Bus Yatra From Naravaripalle on 25th: ఈ నెల 25న నారావారిపల్లె నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి అమర్నాథ్‍ రెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్​ తెలిపారు. ముందుగా నారా భువనేశ్వరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోని.. ఆ తరువాత రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారావారిపల్లెకు వెళతారని ఆయన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను నారాభువనేశ్వరి పరామర్శిస్తారన్నారు. అంతే కాకుండా నారావారిపల్లెలో పెద్దల సమాదుల వద్ద భువనేశ్వరి పూజలు చేసి అగరాలలో మహిళలతో భువనేశ్వరి సమావేశమవుతారని తెలిపారు. 26న తిరుపతి నియోజకవర్గం, 27న శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో పర్యటించి ఆ తరువాత హైదరాబాద్‍ వెళ్లనున్నట్లు మాజీ మంత్రి అమరనాథ్‍ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.