Nandamuri Rama Krishna Protest Initiation: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ, జనసేన నిరసన దీక్ష.. పాల్గొన్న నందమూరి రామకృష్ణ - నిరసన దీక్షలో నందమూరి రామకృష్ణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 2:48 PM IST

Nandamuri Rama Krishna in Protest Initiation: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు, మిత్ర పక్షమైన జనసైనికులతో పాటు సీపీఐ చేపట్టిన నిరసన దీక్షలో నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​ స్థాపించిన టీడీపీ.. బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్​ వేసిన బాటలోనే చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని స్పష్టం చేశారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును రాక్షసంగా అరెస్టు చేసి రిమాండ్​కు పంపిందని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్​ చేయమని ముందే స్క్రిప్ట్​ రాసిన జగన్​మోహన్​ రెడ్డి.. విదేశాలకు పారిపోయారన్నారు. జగన్​ రాసిన స్క్రిప్ట్​ను డీఐజీతోపాటు పోలీస్​ శాఖ ఫాలో అవుతూ.. కనీసం ఎఫ్​ఐఆర్​లో చంద్రబాబు పేరు లేకుండానే దౌర్జనంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. టీడీపీ మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు త్వరలోనే తప్పకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.