Nakka Anand Babu comments on Jagan: జగన్ అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడదాం : నక్కా ఆనంద్ బాబు - జనసేన పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 5:25 PM IST
Nakka Anand Babu Comments on Jagan: జగన్ మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకు తెలుగుదేశం-జనసేన కలిసి ఉద్యమిస్తాయని టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ పరిశీలకులు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. ఏలూరులోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన పరిశీలకులు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొనగా.. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించిన వారికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. క్షేత్రస్థాయిలో వైసీపీ దాడులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని సమావేశంలో తీర్మానించారు. ఆధారాలు లేని కేసులో జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని నేతలు పేర్కొన్నారు. జగన్ పాలనకు శాశ్వతంగా చరమగీతం పాడతారని టీడీపీ పరిశీలకులు నక్కా ఆనంద్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు.