'సీఎం జగన్ అండ్ టీం దండుపాళ్యం గ్యాంగ్ - ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 3:52 PM IST
|Updated : Dec 16, 2023, 3:59 PM IST
Nakka Anand Babu Comments on Capital Shift: అమరావతి విధ్వంసానికి జగన్ పాల్పడి నాలుగేళ్లు అయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గుర్తుచేశారు. ఏపీని సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని ఆయన మండిపడ్డారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు. సీఎం జగన్ అండ్ టీం దండుపాళ్యం గ్యాంగ్ లాగా తయారై, అమరావతిని దోచేశారని నక్కా ఆనంద్ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారం రాగానే మాట మార్చారని నక్కాఆనంద్‌బాబు విమర్శించారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు కానీ మూడు రాజధానులు ఎలా కడతారని నిలదీశారు. అమరావతి, ఆంద్రప్రదేశ్ కు ఉన్న బ్రాండ్ ను సీఎం జగన్ పాడు చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నక్కాఆనంద్‌బాబు స్పష్టంచేశారు.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే, అమరావతి ప్రాంతానికి ఓ కులానికి చెందినది అనే ముద్ర వేశారని నక్కా తెలిపారు. రాజధానిలో అన్ని రకాల కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. అమరావతిపై హైకోర్టు, సుప్రీం కోర్టు అంటూ కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే, యవతకు ఉపాధి మార్గాలు చూపించే విధంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. అమరావతి రైతులు రాజధాని కోసం నాలుగు సంవత్సరాలు అయినా మెుక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారని నక్కా పేర్కొన్నారు. రైతుల ఉద్యమం వృథాగా పోదని పేర్కొన్నారు. సైకో పరిపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడినట్లు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. రాజధానిని విశాఖకు తరలిస్తున్నామంటూ జనాల్ని మోసం చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.