ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ - మనోహర్ కామినేని భేటి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 3:26 PM IST
|Updated : Jan 16, 2024, 3:51 PM IST
Nadendla Manohar met with former Minister Kamineni Srinivas: గుంటూరు జిల్లాలో జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. తెలుగుదేశం నేత యడ్లపాటి వెంకట్రావు నివాసంలో మనోహర్, కామినేని భేటీ కాగా, ఈ సమావేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భేటీపై కామినేని శ్రీనివాస్ స్పందించి స్పష్టతనిచ్చారు. భేటీ అనంతరం మనోహర్, కామినేనితో అల్పాహారం తీసుకున్నారు. ఈ అల్పాహార విందులో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.
ఇది రాజకీయ సమావేశం కాదని కేవలం ఆత్మీయ సమావేశమేనని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల కోసం ఆలోచించాలని కోరారు. ఈ మేరకు మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. తెలిసో, తెలియకో రాష్ట్రంలో పిచ్చి మొక్కను నాటామని అన్నారు.
పోటీ స్థానాలపై కామినేని వ్యాఖ్యలు: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోటీ స్థానాలపై కామినేని స్పందించారు. ఆ విషయం ముఖ్య నాయకులు చూసుకుంటారని, ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది వారే నిర్ణయిస్తానన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు చూసుకుంటారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, నిత్యావసర ధరల పెరుగుదల, రోడ్లు, విద్యుత్, పెట్రోలు, మౌలిక సదుపాయాల కల్పన దారుణంగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకుని, తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.