వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం - ముస్లింల సమస్యలను పరిష్కరించే పార్టీకే మా మద్దతు : హమీద్ - వక్ఫ్ఆస్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 7:35 PM IST

Muslim Association Demand Protection Of Waqf Properties: రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని వాటిని వెంటనే పరిరక్షించాలని ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ముస్లింలు ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింల సమస్యలను పరిష్కరించే రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ముస్లిం అసోసియేషన్ అధ్యక్షుడు హమీద్ మీడియా సమావేశంలో తెలిపారు. జనాభా ప్రాతిపదికన వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 18 అసెంబ్లీ, 4పార్లమెంటు స్థానాలను కేటాయించాలని హమీద్ డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో సచార్ కమిటీ నివేదిక, రంగనాథ్ మిశ్రా కమిషన్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దుచేసి ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముస్లింలపై మూక దాడులను అరికట్టి దళిత, ముస్లిం మహిళలపై జరిగే అత్యాచారాలను నివారించాలన్నారు. చదువుతో సంబంధం లేకుండా దుల్హన్ పథకాన్ని అమలు చేయాలని హమీద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం తరహా లక్షా ఆరవై వేల రూపాయలు దుల్హన్ పథకం కింద లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.