చెవిలో పూలు, చేతిలో మట్టి గిన్నెలు - మూడో రోజు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - పారిశుద్ధ్యకార్మికులధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 2:52 PM IST

Municipal Workers Strike 3rd Day in Vijayawada : రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజూ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద చెవిలో పూలు, చేతిలో మట్టి గిన్నెలు పట్టుకుని పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. చాలీచాలని జీతాలతో బతకలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కాటారపు గోపాల్​ తదితర నాయకులు పాల్గొన్నారు. 

3rd Day Municipal Workers Strike : రాష్ట్రమంతా ధర్నాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై అధికారులు స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అంగన్​వాడీలు, సమగ్ర శిక్షా సర్వే ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ నిరసనల బాట పట్టినా అధికారులలో మాత్రం చలనం లెేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.