Notice to YCP Office అద్దె చెల్లించండి.. లేకపోతే లీజు రద్దు చేస్తాం! వైసీపీ కార్యాలయానికి అధికారుల నోటీసు!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 10, 2023, 5:58 PM IST

Municipal Authorities Notice to YCP Office: అద్దె బకాయి చెల్లించాలని బాపట్ల జిల్లా చీరాలలోని వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసు అంటించారు. చీరాల పట్టణంలో పురపాలక సంఘానికి చెందిన దుకాణ సముదాయాల్లో అద్దె బకాయిల వసూళ్లపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అద్దె బకాయిలు ఉన్న సుమారు 35 మందికి నోటీసులు జారీచేశారు. ఈ దుకాణాల్లో చీరాల వైసీపీ కార్యాలయం ఉంది. మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ తన వర్గంతో కలిసి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ దుకాణానికి సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయలు అద్దె బకాయిలు చెల్లించకపోవటంతో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. ఇటీవల జరిగిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పురపాలక సంఘానికి సంబంధించిన దుకాణాలు ఎన్ని, అద్దె బకాయిలు తదితర వివరాలు తెలియచేయాలని అధికారులను ప్రశ్నించారు. దీనితో అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. వైసీపీ కార్యాలయంగా ఉన్న ఈ దుకాణానికి సంబంధించి అద్దె గడువు గత ఏప్రిల్ నెలాఖరు వరకు ఉండగా అధికారులు తిరిగి మరో నెల వరకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ అద్దె చెల్లించకపోవటంతో వైసీపీ కార్యాలయానికి ఈ నోటీసు అంటించినట్లు అధికారులు తెలిపారు. వారం రోజులలోగా అద్దె బకాయి 3 లక్షలు చెల్లించాలని లేకపోతే రద్దుచేసి దుకాణానికి తిరిగి వేలం నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెపుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.