పంట నష్టాన్ని పరిశీలించేందుకు కాదు ఫొటోలు దిగేందుకే వచ్చారు: ఎమ్మెల్యేపై ఎంపీటీసీ శివాజీ ఫైర్ - MLA Came to Take Photos mptc shivaji
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 7:23 PM IST
MPTC Member Shivaji Fired on MLA Eliza Toured Eluru District: ఎమ్మెల్యే ఎలిజాపై ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కె. గోకవరం ఎంపీటీసీ(MPTC) సభ్యుడు శివాజీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించించేందుకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇటీవల గోకవరంలో పర్యటించారు. ఎమ్మెల్యే పంట నష్ట ప్రాంతాల పరిశీలనకు వచ్చినప్పుడు వాటి గురించి తెలుసుకునేందుకు ఎంపీటీసీ, సచివాలయ కన్వీనర్‌కు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని శివాజీ మండిపడ్డారు. ఎమ్మెల్యే పంట నష్టాన్ని పరిశీలించేందుకు రాలేదని ఫొటోలు దిగటానికి మాత్రమే వచ్చారని ఎద్దెవా చేశారు.
MLA Came to Take Photos: ఏలూరు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే ఎలిజాపై ఎంపీటీసీ సభ్యుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్కసారి కూడా ఎలిజా ఊరిలోకి రాలేదని, మీటింగ్ పెట్టలేదని మండిపడ్డారు. ఈసారి ఊరిలోకి వస్తే అడ్డుకుంటానని ఎంపీటీసీ సభ్యుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలిజాకు తాను ఓటు వేయనన్నారు. గ్రామాల్లో పలు ఉద్యోగులను స్థానిక నాయకులకు తెలియకుండా నియమించారని, ఎలిజాకు ముడుపులు కావాలని శివాజీ తీవ్ర విమర్శలు చేశారు.
TAGGED:
ELIJA AB Ap elr 10 12