MP Rammohan Naidu on Chandrababu Arrest: 'చంద్రబాబుకు అనుకూలంగా త్వరలో సుప్రీం తీర్పు రావొచ్చు' - మధనాపురంలో పలాస నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 10:22 AM IST
MP Rammohan Naidu on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు రావొచ్చని.. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. 50 రోజులుగా ఆయన జైల్లో ఉండటాన్ని టీడీపీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. త్వరలోనే మచ్చలేని చంద్రుడు చంద్రబాబు.. పులిలా బయటకు వస్తారని పేర్కొన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరూ ఆపలేరని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలువటం ఖాయమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మధనాపురంలో.. జరిగిన పలాస నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో గౌతు శివాజీ, శిరీషతో పాటు ఆయన పాల్గొన్నారు.
"దసరా సెలవులు ముగిసిన తర్వాత ఏ సమయంలోనైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు రావొచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరూ ఆపలేరు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది." - కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ