Mother Threw One Year Old Son into Well: దారుణం.. ఏడాది కుమారుడిని బావిలో పడేసిన తల్లి - ఆంధ్రప్రదేశ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18508517-638-18508517-1684143433007.jpg)
Mother Threw One Year Old Boy into Well: కుటుంబ కలహాలకు.. ముక్కుపచ్చలారని ఏడాది బాలుడు బలయ్యాడు. ఆటలు తప్ప ఇంకేమీ తెలియని ఆ బాలుడిని బావిలోకి వేసేసింది ఓ తల్లి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండంపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొండంపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తున్న నందిని అనే మహిళకు ఉదయాన్నే అత్తమామలతో గొడవ జరిగింది. దీంతో తన ఇద్దరు పిల్లలను సహా ఆత్మహత్య చేసుకుందామని.. గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లింది. ముందుగా చిన్న కుమారుడిని బావిలో వేసేసి.. తరువాత తాను ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. కానీ చిన్న కుమారుడిని బావిలో వేసేసిన అనంతరం.. ఆ తల్లికి బావిలో దూకడానికి ధైర్యం చాలలేదు. దీంతో పిల్లాడిని రక్షించాలంటూ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి.. బాలుడిని బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.