MINOR GIRL RAPE CASE: మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వ సాయం.. అండగా ఉంటామని హామీ
🎬 Watch Now: Feature Video
MINOR GIRL RAPE IN ANDHRA PRADESH: కృష్ణాజిల్లా పామర్రు మండలంలో అత్యాచారానికి గురై మరణించిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజా బాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. మైనర్ బాలిక అత్యాచారం జరగడం బాధాకరమని మంత్రి తానేటి వనిత అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదన్నారు. అత్యాచారానికి పాల్పడినవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనిల్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించారని మంత్రి వనిత తెలిపారు. ఇలాంటి బాధాకర విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరమని వాపోయారు. ఏ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బాధిత కుటుంబానికి స్థానిక వైసీపీ నాయకత్వం అన్నివేళలా అండగా ఉంటుందన్నారు.