Minister Roja fires on Pawan రుషికొండ నిర్మాణాలకు అన్ని అనుమతులున్నాయి.. పవన్ అరిచి అరిచి గుండె ఆగి చనిపోతారేమో: మంత్రి రోజా - పవన్ కల్యాణ్
🎬 Watch Now: Feature Video
Minister Roja fires on Pawan Palyan: రుషికొండలోని నిర్మాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో.. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా దానిపై స్పందిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా రుషికొండపై స్పందించారు. విశాఖపట్నంలోని రుషికొండ నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు వెల్లడించారు. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేంద్ర అటవీశాఖ 2021 మార్చిలోనే సీఆర్‌జెడ్ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఈ రెండు అనుమతులు వచ్చిన తర్వాతే ప్రభుత్వ శాఖలు, ఇతర విభాగాలు మిగిలిన అనుమతులు ఇచ్చాయన్నారు. ఏపీ పీసీబీ నుంచి కూడా అనుమతి ఉందన్నారు. రుషికొండలో నిర్మిస్తున్న భవనాలకు కడుతున్న బిల్డింగులకు ఎలాంటి పర్మిషన్లు లేవంటూ ప్రతిపక్షాలు మాట్లాడటం అర్థరహితమన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి రుషికొండ నిర్మాణాలను వేదికగా చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇంత స్పష్టంగా నిబంధనలు పాటిస్తుంటే కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా అన్నారు. పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అరిచి అరిచి గుండె ఆగి చనిపోతారేమో అని భయంగా ఉందని.. మంత్రి రోజా విమర్శించారు. చదువూ సంధ్య లేని పవన్‌కు మళ్లీ మళ్లీ చెప్తేగాని అర్థంకాదని... అందుకే ఇప్పుడు మరోసారి వివరిస్తున్నానని అన్నారు.