Minister Botsa Satyanarayana on R5 Zone: "హైకోర్టు స్టే పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది" - మంత్రి బొత్స సత్యనారాయణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 10:47 AM IST

Updated : Aug 5, 2023, 12:06 PM IST

Minister Botsa Satyanarayana Comments on R5 Zone: రాజధాని అమరావతిలోని ఆర్​5 జోన్​లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు సొంతిళ్లు సమకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూనే న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయకూడదని దోపిడీదారులు, దళారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని పవన్​ కల్యాణ్​ అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఆయనకు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా?.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం, జీడీపీ పెరిగాయి. ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మైక్​ ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు. ఉద్ధానంలో జీడి పంటకు మద్దతు ధర విషయాన్ని మంత్రి అప్పలరాజు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కొద్దిరోజుల్లో కార్యాచరణ ప్రకటించి మద్దతు ధరపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని వెల్లడించారు.

Last Updated : Aug 5, 2023, 12:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.