నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైనింగ్‌లో అర్థరాత్రి హల్చల్ - అధికార పార్టీ నేత అనుచరుల నిర్వాకం - నెల్లూరు జిల్లా రుస్తుం మైనింగ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2023/640-480-20120135-thumbnail-16x9-mining-mafia-infiltrated-to-rustum-quarry.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 7:53 PM IST
Mining Mafia Infiltrated to Rustum Quarry: నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. మంత్రి కాకాణి నియోజకవర్గం పోదలకూరు మండలం తాడిపర్తి వద్ద మైన్‌లోకి చొరబడిన అక్రమార్కులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. రుస్తుం మైనింగ్‌లో తనను బెదిరించి క్వారీలో మైనింగ్ చేసేందుకు వైసీపీ నాయకుడు పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు యత్నిస్తున్నారని.. మైనింగ్ ఓనర్ విద్యా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ విద్యాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పేర్నేటీ శ్యామ్ ప్రసాద్ మనుషులు ఘటనకు ముందే క్వారీలో మైనింగ్ చేసుకుంటామని బెదిరించినట్లు మైనింగ్ ఓనర్ తెలిపారు.
వారు బెదిరించినట్లుగానే రాత్రి సమయంలో వచ్చి నానా గొడవ చేశారని.. భారీ యంత్రాలను తీసుకువచ్చి తవ్వకాలను పూనుకున్నారని వివరించారు. చట్టపరమైన అర్హతలు తనకు ఉన్నాయని.. తన లీజ్ ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. వారు చేసే పనికి తన లీజ్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై తాను పోలీసులను ఆశ్రయించినట్లు వివరించారు.