Mental Illness Causes and Symptoms : ప్రతి 8 మందిలో ఒకరికి మానసిక రుగ్మత.. పని ఒత్తిడే కారణమంటున్న వైద్యులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 3:03 PM IST

Mental Illness Causes and Symptoms : మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేన్నయినా సాధించగలుగుతాడు. ఆరోగ్యమంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే.. శారీరక సమస్యలు కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగత్మలతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది మానసిక వైద్యం చేయించుకోవటం లేదని నిపుణులు తెలుపుతున్నారు.  

మానసిక రుగ్మతలు పెరగటానికి ప్రధాన కారణం పని ఒత్తిడి అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. ఒత్తిడిని నియంత్రించకపోతే బాధితులు డిప్రెషన్​లోకి వెళ్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తగ్గించేందుకు ఖచ్చితంగా యోగా, ధ్యానం చేయాలని.. అలానే బాధితులు భయపడకుండా వైద్యులను సంప్రదించాలని మానసిక వైద్యుడు డాక్టర్ అయోధ్య సూచిస్తున్నారు.  మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది పిలుపునిచ్చింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.