Mass marriages in Penna Ahobilam: అనంతపురం జిల్లాలో 42 జంటలకు సామూహిక వివాహాలు - అనంతపురం జిల్లాలో 42 జంటలకు సామూహిక వివాహాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/640-480-19307518-thumbnail-16x9-mass-marriages--penna-ahobilam.jpg)
Mass marriages in Penna Ahobilam: అనంతపురంలో జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఒకేసారి 42 జంటలకు శాస్త్రోక్తంగా వివాహాలు జరిపించారు. దీంతో వివాహాలు జరిగిన ఆలయంతో పాటు పరిసర ప్రాంతమంతా సందడి నెలకొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య నేతృత్వంలో పైలా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 42 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ వివాహ వేడుకలో పాల్గొనే దంపతులకు పైలా ఫౌండేషన్ తరఫున బంగారు తాళిబొట్టు, మెట్టెలు,పెళ్లి వస్త్రాలను అందించడమే కాకుండా ఒక్కో జంటకు కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందించారు. కాగా ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి అదే విధంగా ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.