NFIR Marri Raghavaiah about Vizianagaram Train Accident: రైల్వే భద్రత పెంచాలి, కొత్త నియామకాలు చేపట్టాలి: సీనియర్ ఉద్యోగి మర్రి రాఘవయ్య - Marri Raghavaiah interview
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/640-480-19893135-thumbnail-16x9-nfir-marri-raghavaiah-about-vizianagaram-train-accident.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 12:31 PM IST
NFIR Marri Raghavaiah about Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో అంచనాలకు అందని ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ గత కొంత కాలంగా వరుస ఘటనలు జరుగుతున్నా.. వైఫల్యాల నుంచి రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోలేదు. వరుస రైలు ప్రమాదాలకు గల కారణాలు, రైల్వేశాఖ అనుసరించాల్సిన విధానాలు గురించి సీనియర్ రైల్వే ఉద్యోగి మర్రి రాఘవయ్య పలు సూచనలు, సలహాలు అందించారు.
రైల్వే భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త నియామకాలను నిలిపివేయటం సరికాదని.. సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పనిభారం పడుతోందని మర్రి రాఘవయ్య తెలిపారు. అదే విధంగా రైల్వే సిబ్బందికి భద్రతాపరమైన శిక్షణ అవసరమని.. సిబ్బందికి వసతుల కల్పనలో రైల్వేశాఖ విఫలమైందని రాఘవయ్య ఆరోపించారు. సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్న మర్రి రాఘవయ్య.. ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తే ప్రమాదాలు నివరించవచ్చని అన్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధికి.. మర్రి రాఘవయ్య అందించారు. ఆ వివరాలను ముఖాముఖి ద్వారా చూసేయండి.