తాడేపల్లికి విజయవాడ సెంట్రల్ వివాదం - మల్లాది విష్ణుకు బుజ్జగింపులు - Vijayawada Central news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 9:17 PM IST
|Updated : Jan 9, 2024, 10:24 PM IST
Malladi Vishnu meets CM Jagan: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ చార్జి నియామకంపై చెలరేగిన అసంతృప్తి వ్యవహారం తాడేపల్లి చేరింది. ఇటీవలే విజయవాడ సెంట్రల్ ఇన్ చార్జిగా మల్లాది విష్ణును తప్పించిన సీఎం జగన్, ఆయన స్థానంలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సీఎం నియమించారు. ఇన్ చార్జి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో అలక బాట పట్టిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్దమయ్యారు. తన అనుచరులనూ రాజీనామాలకు సిద్దం చేశారు. మల్లాది విష్ణుతో బుజ్జగింపులు దిగిన వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రాంతీయ సమన్వయకర్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో చర్చలు జరిపింది. మల్లాది విష్ణు ను తాడేపల్లికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తో సమావేశమైన సీఎం జగన్ నియోజకవర్గంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఆరా తీశారు. మల్లాది విష్ణు సహా ఆయన వర్గం సహాయ నిరాకరణ చేస్తోన్న వైనాన్ని సీఎం దృష్టికి తెచ్చిన వెల్లంపల్లి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎంను కోరినట్లు తెలిసింది. దీంతో మల్లాది విష్ణును పిలిచి మాట్లాడాలని సజ్జలను సీఎం ఆదేశించారు. విష్ణును తాడేపల్లి పిలిపించిన సజ్జల చర్చించారు. అనంతరం వెల్లంపల్లి, విష్ణులతో కలసి మాట్లాడారు. ఇద్దరూ కలసి నడుస్తూ నియోజకవర్గంలో పార్టీని గెలిపించాలని సూచించినట్లు తెలిసింది. సమావేశం ముగిశాక మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడకుండా తాడేపల్లి నుంచి వెళ్లిపోయారు.