ETV Bharat / offbeat

అద్దిరిపోయే చిట్టిచిట్టి "పెసర పునుగులు" - ఈ అల్లం చట్నీతో తింటే టేస్ట్​ అదుర్స్​! - PESARA PUNUGULU RECIPE

ఈవెనింగ్ టైమ్​ బెస్ట్​ స్నాక్ 'పునుగులు' - ఓసారి ఇలా పెసర పునుగులు చేసేయండి!

How to Make Pesara Punugulu
How to Make Pesara Punugulu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 12:29 PM IST

How to Make Pesara Punugulu : ఈవెనింగ్​ టైమ్​లో వేడివేడి చిట్టి పునుగులు చాలా మంది ఇష్టంగా తింటారు. పునుగులు అల్లం పచ్చడితో ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, నార్మల్​గా మైదా పిండితో పునుగులు చేయడం కామన్. ఎప్పుడూ అలానే కాకుండా ఓసారి ఇలా కొత్తగా పెసర పునుగులు ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన విధంగా పెసర పునుగులు చేస్తే క్రిస్పీగా టేస్ట్​ సూపర్​గా వస్తాయి. అలాగే ఈ పునుగులకు పర్ఫెక్ట్​ కాంబినేషన్​ అయిన అల్లం పచ్చడి తయారీ విధానం కూడా చూద్దాం.

పెసర పునుగులు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • పొట్టు పెసరపప్పు - కప్పు
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం ముక్కలు - 2
  • జీలకర్ర - టీస్పూన్
  • రుచికి సరిపడా - ఉప్పు
  • కరివేపాకు తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • వంటసోడా - చిటికెడు

తయారీ విధానం :

  • ముందుగా పొట్టు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఓ 5 గంటలు నానబెట్టుకోండి.
  • నానెబెట్టిన పెసరపప్పుని వడకట్టి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు తరుగు, వంటసోడా వేసి 5 నిమిషాల పాటు బాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్​పై ముకుడు పెట్టి నూనె వేసి వేడి చేయండి. పెసరపిండి కొద్దిగా చేతిలోకి తీసుకుని వేడివేడి నూనెలో పునుగులు వేసుకోండి.
  • స్టవ్ మీడియం ఫ్లేమ్​లో ఉంచి వీటిని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ పెసరపప్పు పునుగులు రెడీ.
  • ఈ పునుగులు అల్లం పచ్చడితో ఎంతో రుచిగా ఉంటాయి. అల్లం పచ్చడి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

అల్లం పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు :

  • అల్లం ముక్కలు - 50 గ్రాములు
  • పచ్చి శనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • మీడియం కారం గల పచ్చిమర్చి - పావుకేజీ
  • బెల్లం - 70 గ్రాములు
  • చింతపండు - 50 గ్రాములు (నీటిలో నానబెట్టుకోవాలి)
  • రుచికి సరిపడా - ఉప్పు

తాలింపు కోసం :

  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • మినప్పప్పు - టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు

అల్లం పచ్చడి తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై పాన్​ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై పచ్చి శనగపప్పు వేసి వేపండి. తర్వాత మీడియం కారం గల పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిర్చిపైన మచ్చలు ఏర్పడే వరకు వేపండి.
  • ఇలా మారిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చండి.
  • తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, బెల్లం, నీటిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్ పెట్టి​ కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపండి.
  • వేగిన తాలింపులో అల్లం పచ్చడి వేసి బాగా కలపండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే నోరూరించే అల్లం పచ్చడి రెడీ!
  • ఈ రెసిపీలు నచ్చితే మీరు ఇంట్లో ఓసారి ట్రై చేయండి!

ఉడకబెట్టే పనిలేకుండా కమ్మటి "టమాట పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే!

ఇడ్లీ పాత్రలో "వడలు" - చుక్క నూనె అవసరం లేదు - టేస్ట్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.