Mala Mahanadu Leaders Fire on Govt: 'వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నాం' - ap news
🎬 Watch Now: Feature Video
Mala Mahanadu Leaders Fire on Government : దళితులు, గిరిజనులకు రాష్ట్రంలో గజం భూమి కూడా లేకుండా చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దళిత సంఘాల నేతలు గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆరోపించారు. దళితులు, గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు వారినే మోసం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త అసైన్ భూముల చట్టంతో దళితులు, గిరిజనుల భూమి అగ్ర కులాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసిందని మాల మహానాడు అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన జగన్.. మాట తప్పడంతో దళిత, గిరిజన యువత 5 వేల రూపాయలకే వాలంటీర్లుగా పని చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దళిత, గిరిజన ప్రజలు సిద్ధంగా ఉన్నారని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు.