కన్నుల పండువగా చెన్నకేశవ స్వామి రథోత్సవం - పల్నాడు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి రథోత్సవం. కన్నుల పండువగా సాగింది. నలుదిక్కుల జన సందోహంతో.. ఇసుకేస్తే రాలనంతగా... వేలాదిగా తరలివచ్చిన భక్తులు జై చెన్నకేశవా.. జై జై చెన్నకేశవా అంటూ... శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్నారు. చెన్నకేశవ స్వామి రథాన్ని లాగారు. చెన్నకేశవ నామ స్మరణతో మాచర్ల వీధులు పులకించి పోయాయి. రథోత్సవానికి ముందు కుంచన పల్లి వంశీయులు పూజలు నిర్వహించారు. సాయంత్రం దేవాలయం నుంచి వేలాది మంది భక్తులు మధ్య ఉత్సవ విగ్రహాలను రథం పైకి చేర్చి ఊరేగించారు. మాచర్లలో పలు వీధులన్నీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురజాల డిఎస్పీ మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రధోత్సవం సందర్భంగా శాప్ ఛైర్మెన్ భైరెడ్డి సిద్దార్థ రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, టీడీపీ ఇంచార్జి జులకంటి బ్రహ్మారెడ్డి స్వామిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు.