Lorry Fire Accident in AP: ఒక్కసారిగా లారీలో చెలరేగిన మంటలు.. దగ్ధం - Major Fire In Lorry in srikakulam
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19683366-thumbnail-16x9-lorry-fire.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 10:43 PM IST
|Updated : Oct 4, 2023, 10:53 PM IST
Lorry Fire Accident in AP: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో సమస్యలు వచ్చాయి. డ్రైవర్ లారీని రోడ్డుపై ఆపాడు. ఆ లారీలోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమయ్యారు. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లారీ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మెుదట అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వారి వల్ల కాకపోవడంతో.. నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు, సోంపేట ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చే లోపే లారీ అగ్నికి ఆహుతైంది. ఎట్టకేలకూ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరశీలిస్తున్నట్లు తెలిపారు. మంటల ధాటికి లారీలో ఉన్న సరుకంతా బుగ్గిపాలైందని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.