Fraud with TTD Chairman photo on WHATSAPP DP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫొటోతో కొందరు కేటుగాళ్లు భక్తులకు వల విసురుతున్నారు. బీఆర్ నాయుడు ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. తిరుమల సమాచారం అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తులను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు.
వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. బాధిత వ్యక్తులు విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ అధికారులు ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ జావేద్‌ఖాన్‌గా గుర్తించారు. మోసాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్, పోలీసు అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు - ఎవరెవరికి ఎంత వాటా ?
కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్