నంద్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి మరొ ఇద్దరికి తీవ్రగాయాలు - నంద్యాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 8:02 PM IST

Lorry Collided Auto in Nandyal District: నంద్యాల జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని నూనెపల్లి వద్ద రహదారిపై ఆటోను లారీ ఢీ కొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జు కాగా మృతదేహలు అందులో ఇరుక్కున్నాయి. తీవ్రంగా శ్రమించి స్థానికులు మృతదేహలను ఆటో నుంచి బయటకు తీశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తి తన భార్యకు నంద్యాలలో వైద్యం చేయించుకుని ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో భాస్కర్​ అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో నూనెపల్లి వద్దకు చేరుకోగానే, ఎదురుగా గేదేలను ఎక్కించుకుని వస్తున్న లారీ వీరి వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న ఇక్బాల్​, ఆటో డ్రైవర్​ భాస్కర్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇక్బాల్​ భార్య నబిసా, కుతూరు ఆక్సలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను నంద్యాల ప్రభూత్వాసుపత్రికి తరలించారు. ఆటోను ఢీ కొట్టిన గేదేల లారీ మరో లారీని ఢీ కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో గంటకు పైగా ట్రాఫిక్​కు ఆటంకం ఏర్పడింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.