Yuvagalam Padayatra: రైతుల బాధలు వింటుంటే కన్నీళ్లొచ్చాయి: లోకేశ్ - కర్నూలులో లోకేష్ పాదయాత్ర
🎬 Watch Now: Feature Video
Lokesh Padayatra : రైతులు పడుతున్న కష్టాలు పాదయాత్ర ద్వారా నేరుగా తెలుసుకున్నానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కర్నూలు జిల్లాలో వ్యవసాయ పనులు లేక గుంటూరు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారని.. వాళ్ళతో మాట్లాడి వారి బాధలు తెలుసుకుంటే కన్నీళ్లు వచ్చాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి క్రాస్ వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నీళ్లు ఇస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని స్పష్టం చేశారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో పది శాతం కూడా ఖర్చు చేయలేదని.. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి రాయలసీమ రైతాంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాజ్యం తెస్తామన్న జగన్.. రైతులు లేని రాజ్యం తెచ్చారని ధ్వజమెత్తారు.
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కు.. ఆ హక్కుని హరిస్తూ జగన్ రైతుల మోటర్లకి మీటర్లు బిగిస్తున్నాడని తెలిపారు. ఒకవేళ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని.. దానికి టీడీపీ అండగా ఉండి పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వివరించారు.
ఇవీ చదవండి :