వలలో చిక్కిన చిరుత - గంటలకొద్దీ చెట్టు కొమ్మకు వేలాడుతూ - వీడియో వైరల్ - చిరుతపులి వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 3:26 PM IST

Updated : Nov 30, 2023, 10:00 PM IST

Leopard In Net And Hangs From Tree In Alluri District: చిరుతపులి వేలాడుతూ ఉండటం మనం సినిమాలో తప్ప మరెక్కడ చూడలేం. అలాంటిది అల్లూరి జిల్లాలో ఓ చిరుత చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది. అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారున రైతులు కోతుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన వలలో ఓ చిరుత పులి చిక్కుకుంది. వల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెట్టు ఎక్కడంతో వల చెట్టు కొమ్మకు చుట్టి ఉండటంతో అక్కడే వలతోపాటు చిరుత చెట్టుకు చిక్కుకొని వేలాడింది.

చిరుత పులి చెట్టుకు వేలాడటం చూసిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులిని చూసేందుకు గ్రామ ప్రజలు అక్కడికి తరలివచ్చారు. అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియటంతో వెంటనే  ఆ స్థలానికి చేరుకున్నారు. చిరుతను చూడటానికి వచ్చిన స్థానికులను అధికారులు అక్కడి నుంచి పంపించారు. వలలో చిక్కుకున్న చిరుతను మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకున్నారు. కానీ మత్తు ఇచ్చిన గంట తర్వాత చిరుత మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, పశు వైద్య బృందం, అటవీ శాఖ సిబ్బంది తమ శాయశక్తులా ప్రయత్నించినా చిరుత ప్రాణాలు కాపాడలేకపోయామన్నారు. ఆహారం, నీరు లేకుండా మత్తు ఇవ్వడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందిందని పలువురు చెప్తున్నారు. చిరుతను ఘటన స్థలంలోనే దహనం చేశారు. 

Last Updated : Nov 30, 2023, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.