Sarpanch Rejected Award : 'నిధులు లేవు.. విధులు లేవు.. పురస్కారాలు, అవార్డు ఎందుకు?' - The lady sarpanch refused the award
🎬 Watch Now: Feature Video
Sarpanch Rejected The Award : నిధులు లేవు.. విధులు లేవు.. పంచాయతీలో అభివృద్ధి లేదు.. మరీ పురస్కారాలు, అవార్డులు ఎందుకని ఓ మహిళా సర్ఫంచ్ ప్రశ్నించారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్‌లను సత్కరించి అవార్డులు ప్రదానం చేయగా ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించారు. సర్పంచ్‌గా ఎన్నికైనా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయానని కనీసం పారిశుద్ధ్య పనులు చేయలేకపోతున్నామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాచవరం సర్పంచ్ నాగ బత్తుల శాంత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని అవార్డులను ప్రధానం చేశారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా అవార్డులు తీసుకోవడం సరికాదన్న ఆమె అవార్డును స్వీకరించలేదు. సర్పంచ్‌గా ఎన్నికై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తమకు విధులు, నిధులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాత్రం దానికి అవార్డులు తీసుకోవడం ఎందుకని మాచవరం సర్పంచ్ నాగ బత్తుల శాంత కుమారి ప్రశ్నించారు.